TS News: 6 ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్‌.. 14న ఫలితాలు వెల్లడి

తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో

Updated : 10 Dec 2021 16:32 IST

హైదరాబాద్‌: క్యాంపులు, రిసార్ట్ రాజకీయాలకు నేటితో తెరపడింది. తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 99.69శాతం పోలింగ్‌ నమోదైంది. 1,324 ఓట్లకుగాను 1,320 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని