TS News: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ తమిళిసై నియమించారు.

Updated : 19 Nov 2021 10:34 IST

హైదరాబాద్‌: నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ తమిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల క్రితం కౌశిక్‌ రెడ్డి పేరును గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదించింది. 

అయితే ఇటీవల ఆయన్ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడంతో తొలుత చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మధుసూదనాచారి పేరును సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన పంపడంతో ఆయన నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని