Huzurabad Bye Election: కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతల మొగ్గు!
గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ భేటీ అయ్యారు.
హైదరాబాద్: గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ భేటీ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం ఇప్పటికే కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి పేర్లతో ఎన్నికల నిర్వహణ కమిటీ మాణికం ఠాగూర్‌కు జాబితా అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు పేర్లపై నేతల అభిప్రాయాన్ని ఆయన సేకరిస్తున్నారు.
సమావేశంలో కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం. సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాన్ని క్రోడీకరించి తుది జాబితాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందజేయనున్నారు. ఈ సమావేశం తర్వాత హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర