TS Congress : రాహుల్‌గాంధీతో కేటీఆర్‌ పోల్చుకోవడం ఏంటి?

తెరాస పెట్టే కేసులకు భయపడేది లేదని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు...

Published : 21 Sep 2021 14:55 IST

కేటీఆర్‌పై మండిపడ్డ మల్లురవి

హైదరాబాద్‌ : తెరాస పెట్టే కేసులకు భయపడేది లేదని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వైట్‌ చాలెంజ్‌ చేస్తే.. దానికి మంత్రి కేటీఆర్‌ పరువునష్టం కలిగిందని అనడం అవివేకమని విమర్శించారు. ఈ అంశంలో ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు.

‘రాహుల్‌ గాంధీతో కేటీఆర్‌ పోల్చుకోవడం ఏమిటి?. కేటీఆర్‌కు, రాహుల్‌గాంధీకి భూమికి,ఆకాశానికి ఉన్న తేడా ఉంది. రాహుల్ గాంధీ పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి.. రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్‌ ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి విసిరిన డ్రగ్స్‌ ఫ్రీ ఛాలెంజ్‌ను కేటీఆర్‌ స్వీకరించాలి’ అని మల్లురవి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని