Ap News: అపోహలు, అభిప్రాయ భేదాల వల్లే అమల్లో ఇబ్బందులు: బొత్స

అమరావతిని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని.. కానీ ప్రతిపక్షాలు చేయనీయకుండా అడ్డుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లుపై ఏపీ సీఎం జగన్‌ స్పష్టంగా తన వైఖరిని శాసనసభలో ప్రకటించారని బొత్స అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే వికేంద్రీకరణ...

Updated : 22 Nov 2021 19:14 IST

అమరావతి: అమరావతిని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని.. కానీ ప్రతిపక్షాలు చేయనీయకుండా అడ్డుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లుపై ఏపీ సీఎం జగన్‌ స్పష్టంగా తన వైఖరిని శాసనసభలో ప్రకటించారని బొత్స అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. అనేక అపోహలు, అభిప్రాయ భేదాల వల్లే అమల్లో ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై భాజపాది రెండు నాల్కల ధోరణి అని.. అందుకే రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల విషయంలో వైకాపా ముందునుంచి ఒకే ధోరణితో ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తడబాటు లేదన్నారు. ప్రజా ప్రయోజ‌నాల కోస‌మే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా స‌మ‌గ్ర, మెరుగైన బిల్లుతో ప్రజల ముందుకు వస్తామని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి మళ్లీ వేగంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని