ఈటలతో వ్యక్తిగత కక్ష లేదు: గంగుల

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

Updated : 20 Jul 2021 17:18 IST

కరీంనగర్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాని చెప్పారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నా అని గంగుల అన్నారు.

నా ప్రాణం అడ్డుపెట్టి బతికించుకుంటా..

‘‘ రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. ఈటలకు ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టి బతికించుకుంటా. నాకు నేరచరిత్ర లేదు. దళిత బంధు కాదు.. రైతు బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం హుజురాబాద్ నుంచే ప్రారంభించింది. ఎన్నికలకు పథకాలకు సంబంధం లేదు’’ అని గంగుల అన్నారు.

నిన్న కమాలాపూర్‌ మండలంలో ప్రజాదీవెన యాత్రను ప్రారంభించిన ఈటల ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఒక మంత్రి తనపై దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారని తనకు ఒకరు చెప్పినట్లు ఈటల అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని