TS News: ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు ఎన్నిక

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.

Updated : 24 Sep 2022 17:14 IST

హైదరాబాద్‌: ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తా. 80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దాం. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దాం’’ అని హరీశ్‌రావు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని