Published : 04 Sep 2021 01:19 IST

Eatala Vs Harishrao: ఈటల వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: హరీశ్‌రావు

హుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. హుజూరాబాద్‌లో విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీశ్‌రావు.. తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. విద్యుత్‌ సమస్యను పరిష్కరించి పొరుగు రాష్ట్రాలకు కరెంట్‌ అమ్మే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. భాజపా నేతలు చవకబారు విమర్శలు మానుకొని హుజూరాబాద్‌కు ఏం మేలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఈటల రాజేందర్‌ రాజీనామా చేశారు.. ఎందుకు చేశారు?హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ కావాలనా?హుజూరాబాద్‌ను జిల్లా చేయమని చేశారా? వావిలాలను మండల కేంద్రంగా ప్రకటించాలని చేశారా? ఒక వేళ.. ఈటల గెలిచినా వ్యక్తిగతంగా ఆయనకు లాభం జరుగుతుంది. కానీ, హుజూరాబాద్‌ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? వ్యవస్థ ప్రయోజనం ముఖ్యమా? ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్