TS News: కేంద్రం, భాజపా నేతల నాటకాన్ని ప్రజలు  గమనించాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ రైతుల విషయంలో కేంద్రం, భాజపా నేతల నాటకాన్ని ప్రజలు గమనించాలని రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు...

Updated : 21 Nov 2021 17:41 IST

హైదరాబాద్‌:  తెలంగాణ రైతుల విషయంలో కేంద్రం, భాజపా నేతల నాటకాన్ని ప్రజలు గమనించాలని రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనలేమని కేంద్రం చెబుతుంటే.. వరి తప్ప మరేది వేయొద్దని భాజపా నేతలు  రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ఏ పంట వేయాలో ఫిబ్రవరిలో చెబుతామని బండి సంజయ్‌ అనడం దారుణమన్నారు.  వ్యవసాయం గురించి ఏమీ తెలియని  అజ్ఞాని బండి సంజయ్‌ అని విమర్శించారు. ఆయన వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. భాజపా నేతలకు రైతుల ప్రాణాలు, ప్రయోజనాలు అక్కర్లేదా? అని  ప్రశ్నించారు. యాసంగిలో రైతులు ఏ రకం వరి ధాన్యం వేయాలో  కేంద్రం, బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దొడ్డు వడ్లు పండిస్తే కేంద్రం కొంటుందా? లేదా? చెప్పాలని రైతులు అడుగుతున్నారని  జగదీశ్‌ రెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని