
TS News: తెలంగాణ రైతుల ముందు భాజపా, కాంగ్రెస్ ఆటలు సాగవు: జగదీశ్‌రెడ్డి
దిల్లీ: మొత్తం ధాన్యం కొంటారో లేదో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పటం లేదని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆరేళ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ‘‘వానాకాలంలో రైతులు 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు కోటి టన్నుల ధాన్యం వస్తోంది. వానాకాలంలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకే దిల్లీలో ఉన్నాం. కానీ, కేంద్ర మంత్రి ఏ విషయం స్పష్టం చేయడంలేదు. రాష్ట్రం నుంచి బియ్యం తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదే. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ పార్టీ పనిచేస్తుందో రైతులు అర్థం చేసుకుంటున్నారు. భాజపాకు తోడుగా ఒక తోక పార్టీలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఆ పార్టీ ఎంపీలకు లోక్‌సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు రైతుల తరఫున మాట్లాడకుండా బాజపా నేతల మొప్పు పొందే ప్రయత్నం చేశారు. రైతుల తరఫున చివరి క్షణం వరకు పోరాడే నాయకుడు కేసీఆర్, పోరాడే పార్టీ తెరాస. కేంద్ర మంత్రి ధాన్యం కొంటారో లేదో చెప్పకుండా భాజపా నేతలతో తిట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలు, రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర మంత్రులు దిల్లీకి రావాల్సి వచ్చింది. తెలంగాణ రైతాంగం చైతన్యవంతమైంది. వారి ముందట కాంగ్రెస్, భాజపా ఆటలు సాగవు’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.