Ts politics: భాజపాకు షాక్‌ ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు: జగదీశ్‌రెడ్డి

తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ

Updated : 12 Oct 2022 14:33 IST

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మిషన్‌ భగీరథ చక్కని పథకం, నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్‌ చెప్పినా కేంద్రం స్పందించలేదన్నారు. కేంద్రమంత్రి గానీ, భాజపా ఎంపీలు గానీ రాష్ట్రానికి నిధులేమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. ‘‘దేశ ప్రజల నెత్తిమీద రోజుకో బండ వేస్తున్నదెవరు? పెట్రోల్‌, డీజిల్‌ ధర వందకు పైగా చేసిందెవరు? భాజపాకు షాక్‌ ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టో, తెరాస మేనిఫెస్టో ప్రజలముందు పెట్టి చర్చ చేద్దామా? అందుకు కిషన్‌రెడ్డి సిద్ధమా? పార్లమెంట్‌లో ఎవరు ఏ ప్రశ్న అడిగినా తెలంగాణకు పొగడ్తలే తప్ప .. నిధులు ఇచ్చింది లేదు. భాజపా నేతలు పార్లమెంట్‌లో ఓ విధంగా.. మీడియా ఎదుట మరో విధంగా మాట్లాడుతున్నారు’’ అని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని