TS News: సౌకర్యాల కల్పనలో వెనుకాడం.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్‌

చంచల్‌గూడ జైలును తరలించాలనే విజ్ఞప్తులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. చంచల్‌గూడ సమీపంలో ..

Updated : 28 Aug 2021 15:28 IST

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలును తరలించాలనే విజ్ఞప్తులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. చంచల్‌గూడ సమీపంలో ఉన్న పిల్లి గుడిసెల బస్తీలో నిర్మించిన 288 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మురికివాడగా ఉన్న ఈ బస్తీని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రూ.24 కోట్ల 91 లక్షల వ్యయంతో తొమ్మిది అంతస్తుల్లో ఇళ్లను నిర్మించామన్నారు. విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని కేటీఆర్‌ చెప్పారు. 

కేసీఆర్‌ నాయకత్వంలో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ‘‘రెండు పడక గదుల ఇళ్లు, పైవంతెన నిర్మాణాలు చాలా వరకు పూర్తి చేశాం. రూ.30 లక్షలకు పైగా విలువైన ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం. నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాం. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధిపై సమీక్ష చేశాం. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకాడదు. ఉస్మానియా ఆస్పత్రి కొత్తది కట్టాలని స్థానిక నేతలు కోరారు. 70ఏళ్లలో కేవలం 3 ఆస్పత్రులు కట్టారు. రెండేళ్లలో మేం 4 టిమ్స్‌లు నిర్మించబోతున్నాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని