TS Assembly: అది రుణం కాదు.. భవిష్యత్తుకు పెట్టుబడి: కేటీఆర్‌

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయి.

Updated : 27 Sep 2021 12:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయి. పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని.. దాన్ని రుణంగా చూడొద్దన్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ తగ్గించే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తి చేసుకున్నామన్నారు.

24 లింక్‌రోడ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి రూ.5,900 కోట్ల రుణం తీసుకున్నామన్న కేటీఆర్‌.. వాటిని భవిష్యత్తుకు పెట్టుబడులగానే చూడాలని సూచించారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి జరుగుతుందని.. ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తి అయ్యాయని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని