
KTR: చర్లపల్లి జైలుకెళ్లొచ్చిన వారితో కాదు.. రాహుల్ అయితే సిద్ధం: కేటీఆర్
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై మంత్రి కేటీ రామారావు స్పందించారు. ‘‘ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధమేనా?రాహుల్ ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్‌చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా?ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్ ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. మరోవైపు రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా స్పందించారు. మ.12గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్ మాదిరి మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని ఇటీవల రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ వద్దకు వస్తానని.. వైట్ ఛాలెంజ్‌లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్దామన్నారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్ సవాల్ విసిరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.