Ts News: ‘మంగళవారం మరదలమ్మా’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ

‘మంగళవారం మరదలమ్మా’ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘నేను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు

Updated : 29 Oct 2021 19:29 IST

హైదరాబాద్: ‘మంగళవారం మరదలమ్మా’ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘నేను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను’’ అని మంత్రి వివరించారు. ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తాను అన్న మాటలు.. సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతాయన్నారు. . ‘‘వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నా కుమార్తె కంటే పెద్దది.. నా సోదరి కంటే చిన్నది. తన తండ్రి సమకాలికుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎకవచనంతో సంబోధించడం సంస్కారమేనా?’’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో తెరాస పార్టీ శ్రేణులు సరైన సమయంలో స్పందిస్తాయన్నారు. వారి మౌనం, సంయమనం, సంస్కారానికి నిదర్శనమన్నారు.

‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని