Huzurabad By Election: ఈటలది బయట బీసీ కార్డు.. లోపల ఓసీ కార్డు: శ్రీనివాస్‌గౌడ్

మంత్రి పదవిలో ఉన్నప్పుడే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని.. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు

Updated : 24 Sep 2022 14:21 IST

హుజూరాబాద్‌: మంత్రి పదవిలో ఉన్నప్పుడే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని.. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఈటలను తెలంగాణకు పరిచయం చేసింది సీఎం కేసీఆరేనని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుజూరాబాద్‌ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఈటలపైనే ఎందుకొచ్చాయని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆయనది బయట బీసీ కార్డు.. లోపల ఓసీ కార్డు అని ఎద్దేవా చేశారు. 

మరోవైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి నేడే చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ముఖ్యనేతలంతా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. ఈనెల 30న ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని