TS Assembly: తెలంగాణలో గొర్రెల పెంపకంతో రూ.10వేల కోట్ల సంపద: తలసాని

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకంతో రూ.10వేల కోట్ల సంపద సృష్టించామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

Updated : 27 Sep 2021 15:19 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకంతో రూ.10వేల కోట్ల సంపద సృష్టించామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శాసనసభలో తెలిపారు. పురపాలికల్లో ఉన్నవారికి గొర్రెల పంపిణీ అంశం పరిశీలనలో ఉందని వెల్లడించారు. గొర్రెల పెంపకం వృత్తిలో ముస్లింలు ఉన్నందున వారికి కూడా ఈ పథకంలో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన తలసాని.. మొదటి దశ పెండింగ్‌ డీడీలు కొన్ని ఉన్నాయని వాటిని త్వరలో చెల్లిస్తామన్నారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్లకూ రిజర్వేషన్లు: శ్రీనివాస్‌గౌడ్‌

మద్యం షాపుల్లో కల్పించిన రిజర్వేషన్ల తరహాలోనే బార్‌ అండ్‌ రెస్టారెంట్లకూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి.. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.

పోడు భూముల సమస్యపై ప్రభుత్వం సబ్‌ కమిటీ వేసి వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ రైతులకు నోటీసులు ఇవ్వొద్దని, కందకాలు తవ్వొద్దని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అటవీశాఖ మంత్రిని కోరారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని