Ts News: నా బాధను అధిష్ఠానానికి నేరుగా చెప్తాను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

లే అవుట్లను క్రమబద్ధీకరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లోనూ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు రూ.లక్షలు...

Published : 07 Jan 2022 01:45 IST

హైదరాబాద్‌: లే అవుట్లను క్రమబద్ధీకరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లోనూ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు రూ.లక్షలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటారని.. నిర్మాణం పూర్తి అయిన వాటిని కూల్చడం సరికాదన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్లాట్లు, ఇళ్లు క్రమబద్ధీకరించాలని కోరుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 8న ఇందిరా పార్కు వద్ద 10 మందితో నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు.

పార్టీ అంతర్గత విషయాలను బయట పెట్టనని జగ్గారెడ్డి తెలిపారు. తన బాధను రాజకీయ వ్యవహారాల కమిటీలో చెప్పినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని.. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. తన బాధను అధిష్ఠానానికి నేరుగా వివరించనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని