
Ts News: అదే భాషను అమిత్ షా కుమారుడిపై వాడితే సమర్థిస్తారా?: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వకాల్తా పుచ్చుకొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాజపా బంట్రోతులా మారిపోయారని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంత్రులు, ఎంపీల బృందానికి గాజులు, చీరలు పంపుతామంటూ వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచారని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, భాజపాలు తెలంగాణకు పరాయి పార్టీలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే.. రేవంత్, భాజపా నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న లాంటి వారు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై వాడుతున్న భాషను తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు. కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న వాడిన భాషను అమిత్ షా కుమారుడిపై వాడితే భాజపా నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోక పోతే తెరాస శ్రేణులు ఎక్కడికక్కడ తరిమి కొడతాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.