
Updated : 26 Sep 2021 14:40 IST
AP News: విప్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోండి: పెద్దిరెడ్డికి రోజా ఫిర్యాదు
తిరుపతి: చిత్తూరు జిల్లా నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ను ఉల్లంఘించిన ఎంపీటీసీ సభ్యులను అనర్హులుగా ప్రకటించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో ఆమె కలిశారు. నిండ్ర ఎంపీపీ ఎన్నికను అడ్డుకోవడంతో పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన చక్రపాణిరెడ్డి, ఆయన సొదరుడిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకు పదవులను కేటాయిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని రోజా మంత్రికి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి
Tags :