TS POLITICS: కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే సీతక్క 

ఇంద్రవెల్లి సభపై తెరాస నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని సభల్లో గర్జిస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క

Updated : 11 Aug 2021 05:09 IST

హైదరాబాద్‌: ఇంద్రవెల్లి సభపై తెరాస నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని సభల్లో గర్జిస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎస్సీ సెల్‌ ఛైర్మన్ ప్రీతమ్, ఎస్టీ సెల్‌ ఛైర్మన్ జగన్‌లాల్‌ నాయక్‌లతో కలిసి సీతక్క మీడియాతో మాట్లాడారు.

ఇంద్రవెల్లి సభతో ఇప్పుడు పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందని.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో దళిత బంధు వచ్చిందని సీతక్క ఎద్దేవా చేశారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని మరిచిపోలేదని, ఫాం హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను మరిచిపోయారని ధ్వజమెత్తారు. తెరాస నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. పోడు భూములపై గిరిజనులకు సోనియాగాంధీ హక్కు కల్పించారని తెలిపారు. దళిత, గిరిజనులకు ఇందిరాగాంధీ భూములిస్తే కేసీఆర్‌ గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఇంద్రవెల్లి సభకు వచ్చే వారిని కొందరు పోలీసులు వ్యక్తిగత ఎజెండాతో అడ్డుకున్నారని, అయినా సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని