Ts News: తీన్మార్‌ మల్లన్న ఏమైనా తీవ్రవాదా..?: ఎంపీ అర్వింద్‌

తీన్మార్‌ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే భాజపాలోకి స్వీకరిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వెల్లడించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను

Updated : 05 Oct 2021 05:03 IST

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే భాజపాలోకి ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వెల్లడించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా కలిసిన అర్వింద్‌ అక్కడే మీడియాతో మాట్లాడారు. పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. గత 37 రోజులుగా మారుమూల సెల్‌లో ఒక్కడినే ఉంచారని.. అయినా మల్లన్న ఆత్మ విశ్వాసంతో ఉన్నారని ఎంపీ తెలిపారు. మల్లన్నను జైలులో మానసికంగా వేధిస్తున్నారన్నారు. జైలు అధికారులు తీవ్రవాదిలా చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అప్రజాస్వామికంగా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని