Updated : 20/08/2021 20:17 IST

Ap News: అప్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచుతున్నారు: ఎంపీ రఘురామ

అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారని  దుయ్యబట్టారు. ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేయకపోగా..ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల్లో కోత విధిస్తోందని విమర్శించారు. 20వ తేదీ వచ్చినా ఇంకా 20శాతం మందికి వేతనాలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలనే వెళ్లగొడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరుగుతుందని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

‘‘రోజు విడిచి రోజు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. స్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆర్థికంగా మనం అస్తమిస్తున్నాం.. అస్తమించాం. ఉద్యోగులకు పీఎఫ్‌ వేతనాల్లో కోత విధించి ఆ డబ్బులను వాడేసుకుంటున్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ. 2.56 లక్షల కోట్లు అప్పు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచుతున్నారు. రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసి ప్రభుత్వం చేసే సంక్షేమం ఎల్లకాలం నిలబడదు. సీఎం వస్తేనే సచివాలయానికి మంత్రులు వస్తున్నారు. సీఎం జగన్‌ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరుతున్నా. మరో పాతికేళ్లు మా పార్టీ అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని రఘురామ అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని