Raghurama: గెజిట్‌ విడుదలపై మోదీకి కృతజ్ఞతలు

కృష్ణ, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని

Updated : 17 Jul 2021 15:02 IST

దిల్లీ: కృష్ణ, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి రఘురామ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని గెజిట్ విడుదల చేసినందుకు ప్రధాని మోదీ, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పునర్‌ విభజన చట్టంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా కేంద్రం దృష్టి సారించాలని కోరారు. 9వ షెడ్యూల్‌లో 107 సంస్థలు, 10వ  షెడ్యూల్‌లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఏడేళ్లు పూర్తి అయినప్పటికీ విభజన జరగలేదని.. వాటిపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని లేఖలో కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని