విశాఖ ఉక్కుపై గళమెత్తుతాం: విజయసాయి

త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

Updated : 15 Jul 2021 17:12 IST

అమరావతి: త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. సభలో వైకాపా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా పోలవరం నిధుల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గళం వినిపిస్తామన్నారు. కేఆర్‌ఎంబీ పరిమితిని కేంద్రం నోటిఫై చేయాలని కోరుతామన్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు