Ap News: ఏపీలో ఉద్రిక్తతల నడుమ ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నెల్లూరు నగరపాలిక, 12 పురపాలికల్లో ఎన్నికలు జరిగాయి. నెల్లూరు పురపాలికలో

Updated : 23 Aug 2022 12:50 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నెల్లూరు నగరపాలిక, 12 పురపాలికల్లో ఎన్నికలు జరిగాయి. నెల్లూరు పురపాలికలో సాయంత్రం 5 గంటల వరకు 50 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చారు. ఎల్లుండి మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, బేతంచెర్ల నగరపాలికల్లో పోలింగ్‌ ముగిసింది.

ఉద్రిక్తతల నడుమ కుప్పం మున్సిపల్‌ పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచి స్థానికేతరులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కుప్పం పోలింగ్‌ జరిగింది. స్థానికేతరుల అంశం తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణకు దారితీసింది. పలు చోట్ల బస్సుల్లో వచ్చిన  స్థానికేతరులను తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానికేతరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం 16వ వార్డులో రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వార్డులో వైకాపా తరఫున ఛైర్మన్‌ అభ్యర్థిగా సుధీర్‌ బరిలో నిలిచారు. 16వ వార్డులోని కళాశాలలో భారీగా స్థానికేతరులు బస చేశారు. దొంగ ఓట్లు వేసేందుకే వచ్చారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. తెదేపా శ్రేణులు ధర్నాకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. కుప్పంలో 80 శాతం పోలింగ్‌ దాటవచ్చని అధికారులు అంచనా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని