Published : 06/12/2021 01:27 IST

AP News: రైతు ఆత్మహత్యల్లో ఏపీది రెండో స్థానం: నాదెండ్ల మనోహర్‌

చెరుకుపల్లి: దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. అధికారులకు టార్గెట్‌ ఇచ్చి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అమరావతి కోసం చిన్న సన్నకారు రైతులు తమ భూములను త్యాగం చేస్తే సీఎం జగన్‌ వారిని అవమానించి రోడ్డుకు లాగారన్నారు. వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జమీందారుల పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌ తీరు ‘మాగ్జిమం కరప్షన్‌ మినిమం సీఎం’గా ఉందని మనోహర్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని