Nara Lokesh: నరసరావుపేట పర్యటనకు వెళ్లి తీరతా..: నారా లోకేశ్‌ 

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ విజయవాడ చేరుకుంది. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లకుండా గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద లోకేశ్‌ను అడ్డుకున్న

Updated : 09 Sep 2021 15:05 IST

విజయవాడ: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ విజయవాడ చేరుకుంది. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లకుండా గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. కృష్ణా వారధి వరకు తీసుకొచ్చారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని.. ఉండవల్లిలోని నివాసానికి తరలిస్తామని లోకేశ్‌కు స్పష్టం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును తప్పుబట్టారు. 

ఈ క్రమంలో పోలీసు అధికారులు, లోకేశ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తనను చేయిపట్టి లాగడాన్ని ఆయన ప్రశ్నించారు. తన పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రాతపూర్వక ఆదేశాలు చూపించాలని నిలదీశారు. నరసరావుపేట పర్యటన ఆపేదిలేదని పోలీసులకు లోకేశ్‌ స్పష్టం చేశారు. పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు.. వెళ్లి తీరతామని లోకేశ్‌, తెదేపా శ్రేణులు తేల్చిచెబుతుండటంతో అక్కడి పరిణామాలు ఉత్కంఠగా మారాయి. లోకేశ్‌ను అడ్డుకోవడంపై న్యాయవాదులు వివరణ కోరారు. 41ఏ సీఆర్‌పీసీ కింద లోకేశ్‌కు రోడ్డుపైనే నోటీసులిచ్చారు. ఈ క్రమంలో కృష్ణా వారధి వద్ద గంటకుపైగా లోకేశ్‌ కాన్వాయ్‌ నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని