Nara Lokesh: ఏపీ.. ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయింది: లోకేశ్‌

సీఎం జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌.. ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated : 13 Sep 2021 13:01 IST

అమరావతి: సీఎం జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌.. ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో వీరాంజనేయులు అనే యువకుడు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటన మరొకటి జరగక ముందే ప్రభుత్వం స్పందించి.. 2.3 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని.. పోరాడి ఉద్యోగాలు సాధిద్దామని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని