Ap News: వైకాపా తీరుపై మండిపడ్డ లోకేశ్‌

ఆడపిల్లలపై జరిగే అన్యాయాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో పలు అమానవీయ ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని...

Published : 22 Aug 2021 01:01 IST

అమరావతి: ఆడపిల్లలపై జరిగే అన్యాయాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో పలు అమానవీయ ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గుంటూరులో బాలికపై అత్యాచారయత్నం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన వారికి శిక్ష వేయకుండా కేవలం సస్పెండ్‌ చేసి చేతులు దులుపేసుకున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో 500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని..ఒక్క కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదని ఆగ్రహించారు. మహిళలకు రక్షణ కల్పించడం కోసం తెదేపా వివిధ రూపాల్లో గళమెత్తినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మహిళ భద్రతకు సరైన చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని