Nara Lokesh: ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది.. జగన్‌కు లోకేశ్ లేఖ
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు
అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. రెండు దశల్లో కొవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే కోయిల్కుంట్లలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయుల పట్ల ముందుగానే సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
‘‘ఏపీలో దాదాపు 12వేల కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 2020లో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవు. గత ఐదు నెలల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలుగా మారడం చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొంత మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన సీఎం జగన్ ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయి. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో చిరాగ్ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు