Nara Lokesh: నారా లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట

Updated : 09 Sep 2021 15:37 IST

గన్నవరం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్‌ బయల్దేరారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. లోకేశ్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. లోకేశ్‌ను అడ్డుకోవడంపై తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను తరలిస్తున్న వాహనశ్రేణిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. 

ధర్నాలు, ఆందోళనలకు వెళ్లట్లేదు: లోకేశ్‌

పోలీసులు తనను అడ్డుకోవడంపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని.. ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళ్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తానని వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని