
AP News: తెదేపా అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్లు: లోకేశ్
మంగళగిరి: దేశంలో అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో జగన్ ప్రథమ స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ భయపడవద్దని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరికి రూ.2,500 కోట్లు తెచ్చామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .. ఆ నిధులతో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్ విసిరారు. సీఎం నివాసానికి సమీపంలోనే విచ్చలవిడిగా మత్తు పదార్ధాల విక్రయాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉంటున్న నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. తాడేపల్లిలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.