AP News: అయ్యన్నపాత్రుడిని అడ్డుకున్న నర్సీపట్నం పోలీసులు

శాసనసభలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..

Updated : 24 Nov 2021 16:17 IST

నర్సీపట్నం: శాసనసభలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వ్యతిరేకిస్తూ స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి నిరసనగా వెళ్లాలని అయ్యన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏ విధమైన అనుమతులు లేవని అయ్యన్నపాత్రుడిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా నిరసన కార్యక్రమాన్ని నిలిపే ప్రసక్తే లేదని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని