Ap News: మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి నిరసన సెగ.. అసంపూర్తిగా ముగిసిన పర్యటన

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌ బాబుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు. వరదలో ఇళ్లు మునిగి...

Updated : 23 Nov 2021 18:36 IST

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌ బాబుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు. వరదలో ఇళ్లు మునిగి కట్టుబట్టలతో వీధిన పడ్డామన్నారు. ఆహారం, తాగునీరు లేక అలమటించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలపై ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా అదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా పర్యటించకుండానే మంత్రి వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని