TS News: రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయి

గతంలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Updated : 13 Nov 2021 20:29 IST

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌ : గతంలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలను రైతులు శిక్షించారని అన్నారు. నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

‘దేశంలో మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతోంది. రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుంది. దేశ జనాభాలో 20-22 కోట్ల మందికి ఇప్పటికీ తిండిగింజలు లేవు. దేశంలోని ధాన్యం నిల్వలను పేదలకు పంచొచ్చు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా? సామాన్యుల డబ్బులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. దేశంలో నూనెగింజల ఉత్పత్తికి కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పంటమార్పిడికి అవసరమైన ప్రోత్సాహకం అందించట్లేదు. దేశవ్యాప్తంగా మొత్తం వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నప్పటికీ.. కొత్త మార్గాలు అన్వేషించకుండా రైతులను గోస పెడుతున్నారు’ అని నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని