రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. వైకాపా ఎంపీ..

Updated : 15 Jul 2021 21:38 IST

దిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించారు. మరోవైపు ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఫిర్యాదు చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని