Published : 08/10/2021 12:50 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: నామినేషన్‌ వేసేందుకు తరలివచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

హుజూరాబాద్‌: త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు హుజూరాబాద్‌ చేరుకున్నారు. నామినేషన్‌ పత్రాలతో ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్న తమను నామినేషన్‌ వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు నినాదాలు చేశారు.

తమను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఉప ఎన్నికలో పోటీచేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో తమకు అనుకూలంగా సీఎం ప్రకటన చేస్తే తెరాసకే మద్దతు ఇస్తామని.. లేకపోతే తెరాసకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా నామినేషన్లు వేయొచ్చని..  అయితే ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్