AP News: రమ్య మృతదేహం తరలించకుండా అడ్డగింత

నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు

Updated : 16 Aug 2021 12:56 IST

గుంటూరు: నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది. దీంతో రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్‌ వద్దకు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

జీజీహెచ్‌ వద్ద తెదేపా, వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరమయ్యగుంటలోని రమ్య నివాసానికి మృతదేహాన్ని తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని