Pawan kalyan: 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ దేశానికే గర్వకారణం: పవన్‌

100 కోట్ల కొవిడ్‌ టీకాల పూర్తి దేశానికి గర్వకారణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ 100 కోట్ల మార్క్‌ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన

Published : 21 Oct 2021 20:23 IST

హైదరాబాద్‌: 100 కోట్ల కొవిడ్‌ టీకాల పూర్తి దేశానికి గర్వకారణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ 100 కోట్ల మార్క్‌ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన విషయం. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం గర్వకారణం. గడచిన ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే కాకుండా భారతదేశాన్ని కూడా ఓ కుదుపు కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది చనిపోతారని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వీటన్నిటినీ దాటుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ 100కోట్ల మార్క్‌ దాటింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, వైరాలజిస్టులకు అభినందనలు’’ అని పవన్‌ కల్యాణ్‌  ప్రకటనలో తెలిపారు.

టీకా పంపిణీలో భారత్‌ నేడు 100కోట్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ కీర్తి గడించింది. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని