
Updated : 18 Oct 2021 15:54 IST
Ts News: హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి: పొన్నాల
హైదరాబాద్: ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులేకుండా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు భారం పెరిగి నిత్యావసర సరకుల ధరలు సైతం పెరిగిపోతున్నాయని తెలిపారు. దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని ఆక్షేపించారు. హుజూరాబాద్ ప్రజలకు భాజపా ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీఎం కేసీఆర్.. హుజూరాబాద్ ప్రజలకు వీటిపై సమాధానం చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :