AP News అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదు : రఘురామకృష్ణరాజు

రాజధాని అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి

Published : 18 Dec 2021 01:10 IST

తిరుపతి: రాజధాని అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధానిపై కులం ముద్ర వేశారని, అపార్థం చేసుకున్న వారికి అర్థం చెప్పే వారు లేకే రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు అని కొనియాడారు. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌గా రూపొందించా రని వివరించారు. చివరికి బయోటాయిలెట్లను కూడా అడ్డుకుని... పాదయాత్రలో మహిళలను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, పట్టుదలతో  పాదయాత్ర చేసిన మహిళా రైతులను అభినందించారు.  దేవుడి కృపవల్లే పాదయాత్ర విజయవంతమైందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. కొంతకాలం ఓపికపడితే అమరావతే  ఏకైక రాజధానిగా ఉంటుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు సభావేదికపై వచ్చిన తర్వాత ఆయన్ను రఘురామ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు అభినందించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని