Raghurama: జీతాలివ్వలేని స్థితికి వచ్చారు

నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర..

Updated : 18 Jul 2021 15:59 IST

ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్‌షాకు లేఖ

దిల్లీ: నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రఘురామ లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీలో సవరణ కుదరదని.. మూడు రాజధానులపై పార్లమెంట్‌లోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. నెలలో 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని ఆర్థిక స్థితి ప్రస్తుతం ఏపీలో ఉందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని