
AP News: తెదేపా నేత బ్రహ్మం చౌదరికి రిమాండ్.. గుంటూరు జైలుకు తరలింపు
అమరావతి: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్.ఐ సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా ... అందులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. బుధవారం రాష్ట్ర బంద్ సందర్భంగా ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారమంతా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ఇవాళ ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. అరెస్టు అనంతరం పోలీసులు తనను తీవ్రంగా దూషించారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ కొట్టారని బ్రహ్మం చౌదరి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అనంతరం బ్రహ్మం చౌదరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.