Ap news: వైకాపా నేతల ఒత్తిడి.. రిటర్నింగ్‌ అధికారి కంటతడి

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైకాపా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే రోజా-చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలతో

Updated : 25 Sep 2021 20:29 IST

 

నగరి: చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైకాపా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే రోజా-చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. నిండ్రలో నిన్న జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడగా ఆధిపత్యం కోసం ఇరువర్గాలు పోటాపోటీగా వ్యవహరించాయి. వైకాపా వర్గాల ఒత్తిడితో రిటర్నింగ్ అధికారి కంటతడి పెట్టుకున్నారు. తాము చెప్పినట్టే నడుచుకోవాలని వైకాపాలోని ఇరువర్గాలు అధికారులను బెదిరించారు. వైకాపా నేతల తీరుపట్ల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని