TS News: నిర్బంధాలెన్నున్నా.. ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించి తీరుతా: రేవంత్
నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లికి వెళ్తానని.. అక్కడ రచ్చబండ నిర్వహించి తీరుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లికి వెళ్తానని.. అక్కడ రచ్చబండ నిర్వహించి తీరుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎర్రవెల్లి గ్రామం నిషేధిత ప్రాంతమా?పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?తెరాస, భాజపా కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు దిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు’’ అని రేవంత్ విమర్శించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లట్లేదు కదా?: మల్లు రవి
రచ్చబండకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దిల్లీ వెళ్లొచ్చిన మంత్రులు ధాన్యం విషయంలో ఏం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యక్రమాలనే అడ్డుకుంటున్నారు. కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా?రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్ తన భూమిలో ఎందుకు వేశారు. కాంగ్రెస్ నేతలు ఎర్రవెళ్లి గ్రామానికి వెళ్తే తప్పా?మేం కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్లట్లేదు కదా?రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీలాగా పని చేస్తున్నారు’’ అని మల్లు రవి ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి