
TS News: రేవంత్‌రెడ్డి గృహనిర్బంధం.. ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి నిన్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి నుంచి రేవంత్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.