Ts News: ధాన్యం కొనుగోలుపై ఏదీ తేలకుండా మంత్రులు రావొద్దు: రేవంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలను మోదీ వద్ద

Published : 25 Dec 2021 01:27 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలను మోదీ వద్ద కేసీఆర్‌ తాకట్టుపెట్టారని విమర్శించిన ఆయన.. తెరాస, భాజపా తోడు దొంగలుగా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యాసంగి పంట కొనబోమని కేంద్రం ముందే చెప్పినా.. ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

 ‘‘దిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని ఎంపీలు వచ్చారు. గల్లీలో కాదు దిల్లీలో తేలుస్తామని మంత్రులు దిల్లీ కొచ్చారు. దిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఆరు రోజుల్లో ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి ఏం తేల్చారు. అదనంగా ఎంత ధాన్యం ఇస్తారో కేంద్రానికి మీరు ఏం నివేదిక ఇచ్చారో చెప్పండి. రాష్ట్రం, కేంద్రం మధ్య జరిగిన వ్యవహారం బయటపెట్టండి. అదనపు ధాన్యం ఎంత ఇస్తారో చెప్పకుండా.. కొంటారా? లేదా? అని మంత్రులు మాటలు చెబుతున్నారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొంటామని కేంద్రం చెప్పే వరకు దిల్లీలోనే ఆమరణ దీక్ష చేయండి. ఏదీ తేలకుండా రావొద్దు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు తెరాస నేతలు వీధినాటకాలకు తెరలేపారు. రైతులు ఎవరూ చనిపోవద్దు, కాంగ్రెస్‌ అండగా ఉంటుంది.  డిసెంబరు 27 మధ్యాహ్నం 2గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తాం. రైతులంతా ఎర్రవెల్లికి రావాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని