
TS News: ఉద్యమంలో అమరులైన రైతులకు కేసీఆర్ ప్రకటించిన పరిహారం ఏది?: రేవంత్రెడ్డి
హైదరాబాద్: నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం సాగుచట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. ఉత్తరాదిలో ఎన్నికలకు భయపడి నల్లచట్టాలను మోదీ రద్దు చేశారని విమర్శించారు. ‘‘సాగుచట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్రమంత్రి తోమర్ అన్నారు. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేశాం .. సాగు చట్టాలు తేవడంతో మళ్లీ ముందడుగేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం మళ్లీ నల్లచట్టాలు తీసుకొస్తే తెరాస ఎటువైపు ఉంటుందని ప్రశ్నించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలో రాష్ట్రంలో కేటీఆర్, తెరాస నేతలు పాల్గొన్నారు. కానీ, దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతిచ్చేందుకు సీఎం కేసీఆర్కు మనసొప్పలేదు. దిల్లీ ఉద్యమంలో అమరులైన రైతులకు రూ.3లక్షల చొప్పున పరిహారమిస్తామని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, అమరులైన రైతులకు ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదు. దిల్లీలో వారం రోజులు ఉన్న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు.. రైతుల వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.