
White Challenge: గన్‌పార్కుకు చేరుకున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ‘వైట్ ఛాలెంజ్’ పేరిట సవాల్ కార్యక్రమాన్ని ఇటీవల ఆయన ప్రారంభించారు. డ్రగ్స్ పరీక్షలకు నమూనాలు ఇచ్చేందుకు తాను సిద్ధమని.. మీరు ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరారు. దీనిలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు వస్తే ఆస్పత్రికి వెళ్దామని కోరారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రేవంత్ గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. సవాల్ స్వీకరించినట్లు ఇప్పటికే ప్రకటించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్ది కూడా అక్కడికి వచ్చారు. గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద షబ్బీర్ అలీ సహా పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి రేవంత్ బైటాయించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిషేధించాలని కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. రేవంత్ విసిరిన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.